Header Banner

రాష్ట్రంలోని 26 జిల్లాలో APTS కార్యాలయాలు ప్రారంభం! సైబర్ సెక్యూరిటీతో పాటు పలు సేవలు అందుబాటులో!

  Thu May 15, 2025 22:08        Politics

రాష్ట్రంలోని 26 జిల్లాలో APTS కార్యాలయాలు ప్రారంభిస్తున్నాం - APTS ఛైర్మన్ మన్నవ మోహన కృష్ణ

కూటమి ప్రభుత్వం వచ్చాక జూలై 2024 నుండి ఏప్రిల్ 2025 వరకు, ఈ-ప్రొక్యూర్‌మెంట్ ప్లాట్‌ఫామ్ ద్వారా 55,486 టెండర్లు ప్రచురించడం జరిగింది, మొత్తం ప్రాజెక్టుల విలువ 41,000 కోట్ల రూపాయలు కంటే ఎక్కువ. కూటమి ప్రభుత్వం వచ్చాక జూలై 2024 నుండి ఏప్రిల్ 2025 వరకు, APTS Procurement Services ద్వారా 110 కోట్ల రూపాయలకు పైగా కొనుగులు లావాదేవీలు జరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి APTS procurement services లక్ష్యం సుమారు ₹600 కోట్లు రూపాయలు. సైబర్ సెక్యూరిటీ సేవలను మరింత విస్తృత పరుస్తున్నాము. రాష్ట్రంలోని 26 జిల్లాలో APTS కార్యాలయాలను ప్రారంభిస్తున్నాము. గత ప్రభుత్వం కంటే కూటమి ప్రభుత్వం వచ్చాక APTS సంస్థ మెరుగైన సేవలు అందిస్తోంది అని APTS ఛైర్మన్ మన్నవ మోహన కృష్ణ వెల్లడించారు. 

 

ఎ.పి. టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్: 1986 లో ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ కార్పొరేషన్ (APTS) ప్రారంభం అయ్యింది. IT Consultancy Services, Software మరియు Hardware Procurement, Cyber Security auditing & monitoring, I.T. Infrastructure maintenance, I.T. Projects development, ఆధార్ ఆధారిత సేవలు, Digital Signature Certificates జారీ, E-Governance ఇలా ఎన్నో సర్వీసెస్ తో ఆంధ్రప్రదేశ్ లో IT సర్వీసెస్ ను విస్తృతపరచటంలో APTS ముఖ్య పాత్ర పోషించింది. పాలనలో సాంకేతికతకు పెరుగుతున్న ప్రాముఖ్యతకు ప్రతిస్పందనగా రాష్ట్ర ప్రభుత్వ విభాగాలకు మెరుగైన సేవలందించడానికి APTS తన కార్యకలాపాలు మరియు సాంకేతిక సేవలను విస్తరిస్తోంది. కీలక కార్యక్రమాలు, విజయాలు మరియు Way Forward:

కూటమి ప్రభుత్వం వచ్చాక జూలై 2024 నుండి ఏప్రిల్ 2025 వరకు గణనీయమైన విజయాలతో APTS అనేక ముఖ్యమైన కార్యక్రమాలను చేపట్టింది మరియు భవిష్యత్తు విస్తరణ కోసం ఒక ప్రణాళిక రూపొందించింది:

1. Procurement Services (హార్డ్‌వేర్ మరియు సాఫ్ట్‌వేర్): APTS ఎన్నో దశాబ్దాలుగా ఆంధ్ర ప్రదేశ్ లోని వివిధ ప్రభుత్వ విభాగాలకు, వివిధ ప్రభుత్వ రంగ సంస్థలకు వారి ఐటీ మౌలిక సదుపాయాల సేకరణకు, వారి సాఫ్ట్‌వేర్ మరియు హార్డ్‌వేర్ ప్రొక్యూర్మెంట్ అవసరాలకు APTS ఎంతో అనుభవం, పరిజ్ఞానంతో చాలా పారదర్శకంగా, సమర్ధవంతంగా ఈ ప్రొక్యూర్మెంట్ సర్వీసెస్ అందిస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చాక జూలై 2024 నుండి ఏప్రిల్ 2025 వరకు, APTS Procurement Services ద్వారా 110 కోట్ల రూపాయలకు పైగా కొనుగోలు లావాదేవీలు జరిగాయి. ఇంకా మరిన్ని ప్రొక్యూర్మెంట్స్ జరగబోతున్నాయి కొద్ది రోజులలో. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి మా APTS procurement services లక్ష్యం సుమారు ₹600 కోట్లు రూపాయలు. 

 

2. ఆధార్-ఎనేబుల్డ్ సర్వీసెస్ (AUA/KUA/ASA/KSA): ఆంధ్ర ప్రదేశ్ లో ఆధార్ ఆధారిత సేవలకు APTS ఒక నోడల్ సంస్థగా బాధ్యతలు నిర్వహిస్తూ ఆంధ్ర ప్రదేశ్ లోని ఎన్నో ప్రభుత్వ విభాగాలకు APTS ఈ Authentication సర్వీసెస్ అందిస్తోంది. ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు మరియు వివిధ సేవలు అర్హులకు అందే విధంగా APTS ఈ ఆధార్ authentication చేస్తోంది.
కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక జూలై 2024 నుండి ఏప్రిల్ 2025 వరకు, APTS 19.39 కోట్ల ఆధార్ ఆధారిత transactions మరియు 5.98 కోట్ల e-KYC లావాదేవీలను నిర్వహించింది.

 

ఇది కూడా చదవండితల్లులకు భారీ శుభవార్త.. తల్లికి వందనం అమలుపై అప్‌డేట్! ఆ రోజు అకౌంట్లలోకి మనీ!

 

3. డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్లు (DSC): నేటి డిజిటల్ గవర్నెన్స్ వ్యవస్థలో, సమర్థవంతమైన మరియు విశ్వసనీయ సేవలను అందించటం మరియు transactions secured గా జరగటం చాలా ముఖ్యం. ఈ ప్రక్రియలో డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్లు (DSCలు) కీలక పాత్ర పోషిస్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ విభాగాలకు ఈ డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్లు ను APTS జారీ చేస్తోంది.
జూలై, 2024 నుండి ఏప్రిల్ 2025 వరకు, APTS దాదాపు 19,500 డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్లు జారీ చేసింది.

 

4. సైబర్ సెక్యూరిటీ (auditing services): APTS ఆంధ్రప్రదేశ్‌లో సైబర్ సెక్యూరిటీ విధానాలను అమలు చేసే నోడల్ ఏజెన్సీ. సైబర్ సెక్యూరిటీ నెట్వర్క్ ని మరియు ఇన్ఫ్రా స్ట్రక్చర్ ని మానిటర్ చెయ్యటం, సమీక్షించటం మరియు ఆడిట్ చెయ్యటం ఇలా APTS వివిధ రకాలుగా సేవలను అందిస్తోంది.

APTS కార్పొరేషన్ CERT-In empanelled అని చెప్పడానికి చాలా సంతోషంగా వుంది. ప్రతిష్టాత్మకమైన ఈ CERT-In empanelled గుర్తింపు వల్ల APTS కీలకమైన సైబర్ సెక్యూరిటీ ఆడిట్‌లు, vulnerability assessments, penetration testing, మరియు అధునాతన రెడ్ టీమ్ ఆడిట్ లను నిర్వహించగల సామర్ధ్యం APTS సొంతం.
రాబోయే రోజుల్లో APTS ఈ సైబర్ సెక్యూరిటీ ఆడిటింగ్ గవర్నమెంట్ సెక్టార్ లోనే కాకుండా ప్రైవేట్ సెక్టార్ లో కీలకమైన బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్సు, హెల్త్ కేర్, టెలికాం మొదలగు రంగాల్లో కూడా సెక్యూరిటీ ఆడిట్ చెయ్యబోతున్నాము, అలాగే పక్క రాష్ట్రాల్లో కూడా సెక్యూరిటీ ఆడిట్ చెయ్యటానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాం, తద్వారా సైబర్ సెక్యూరిటీ ఆడిటింగ్ మీద వచ్చే ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. జూలై, 2024 నుండి ఏప్రిల్ 2025 వరకు, APTS వివిధ ప్రభుత్వ వెబ్ అప్లికేషన్‌లు మరియు మొబైల్ అప్లికేషన్‌ల కోసం సెక్యూరిటీ ఆడిట్‌లు మరియు రెడ్ టీం ఆడిట్స్ అన్ని కలిపి 650 కి పైగా ఆడిట్స్ నిర్వహించింది.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

5. సైబర్ సెక్యూరిటీ (monitoring services): APTS సైబర్ సెక్యూరిటీ ఆడిటింగ్ సర్వీసెస్ యే కాకుండా మానిటరింగ్ సర్వీసెస్ కూడా అందిస్తోంది. ఆంధ్రప్రదేశ్ సైబర్ సెక్యూరిటీ ఆపరేషనల్ సెంటర్ (APCSOC), ప్రభుత్వ విభాగాలకు సైబర్ సెక్యూరిటీ ముప్పులు రాకుండా నిరంతరం 24/7 పర్యవేక్షించే ప్రత్యేక కేంద్రం. భారతదేశంలోనే one of the best మానిటరింగ్ సెంటర్ గా స్టేట్ అఫ్ ఆర్ట్ ఫెసిలిటీస్ తో మన APCSOC గుర్తింపు పొందింది. AP స్టేట్ డేటా సెంటర్, AP సెక్రటేరియట్ క్యాంపస్ ఏరియా నెట్‌వర్క్ మరియు మండల స్థాయి వరకు స్టేట్ వైడ్ ఏరియా నెట్‌వర్క్ వంటి అన్ని కీలకమైన state I.T. Infra structure APCSOCతో అనుసంధానించబడ్డాయి. APCSOC వీటిని 24/7 పర్యవేక్షించడం తో పాటు సైబర్ threats గురించి ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తూ మన రాష్ట్ర ఐటీ ఇన్ఫ్రా స్ట్రక్చర్ సురక్షితంగా ఉండటంలో కీలకంగా పని చేస్తోంది. ప్రస్తుతం APCSOC దాదాపు 30,000 ఈవెంట్స్ పర్ సెకండ్ (EPS) ట్రాఫిక్‌ను పర్యవేక్షిస్తుంది.

 

6. APTS Consultancy Services: APTS ఎన్నో రకాలైన కన్సల్టెన్సీ సర్వీసెస్ ఎన్నో సంవత్సరాలుగా అందిస్తోంది. అప్లికేషన్ డెవలప్మెంట్ కి, ప్రాజెక్ట్స్ మేనేజ్ మెంట్ కి, సర్వీస్ ప్రొవైడర్స్ ని ఐడెంటిఫై చెయ్యటానికి ఇలా ఎన్నో రకాలైన కన్సల్టెన్సీ సర్వీసెస్ APTS అందిస్తోంది. ప్రభుత్వం లోని ఎన్నోకీలక శాఖలతో APTS కలిసి పని చేస్తోంది. రియల్ టైం గవర్నెన్స్ లోని కొన్ని ముఖ్యమైన initiatives – మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్, అవేర్ 2.0 ఇలా ఎన్నో RTGS initiatives లో APTS కూడా RTGS department తో కలిసి పని చేస్తోంది.

 

7. E-Procurement ప్లాట్‌ఫామ్: APTS సపోర్ట్ అందిస్తున్నఇంకో కీలకమైన విభాగం E-Procurement ప్లాట్‌ఫామ్. APTS ఈ-ప్రొక్యూర్‌మెంట్ పోర్టల్ ని 2003లో ప్రారంభించింది, ఆ తరువాత అప్డేటెడ్ వెర్షన్ ని APTS 2016 లో ప్రారంభించటం జరిగింది. రాష్ట్రంలోని ఎన్నో కీలక రంగాలైనటువంటి R&B, పంచాయత్ రాజ్, ఇరిగేషన్, హెల్త్ కేర్ ఇలా ఎన్నోవిభాగాల టెండర్ల ప్రక్రియ E-Procurement పోర్టల్ లో విజయవంతం గా జరుగుతున్నాయి.

కూటమి ప్రభుత్వం వచ్చాక జూలై 2024 నుండి ఏప్రిల్ 2025 వరకు, ఈ-ప్రొక్యూర్‌మెంట్ ప్లాట్‌ఫామ్ ద్వారా 55,486 టెండర్లు ప్రచురించబడ్డాయి, మొత్తం ప్రాజెక్టుల విలువ 41,000 కోట్ల రూపాయలు కంటే ఎక్కువ.

 

8. Establishment of APTS Offices in 26 District Headquarters: APTS సర్వీసెస్ ని మరింత పెంచటానికి విస్తృత పరచటానికి APTS తన సేవలను జిల్లా స్థాయికి విస్తరిస్తోంది. రాష్ట్రంలోని అన్ని 26 జిల్లాలలో APTS district offices ప్రారంభించబోతున్నాము. APTS ప్రతి జిల్లా కార్యాలయం ఒక జిల్లా ఐటి మేనేజర్ నేతృత్వంలో, ముగ్గురు అసిస్టెంట్ మేనేజర్ లతో పని చేస్తుంది.
APTS ఇలా జిల్లా స్థాయికి విస్తరించటం వల్ల: District level IT Eco system ను strengthen చెయ్యటానికి, IT infrastructure & Procurements ని మరింత విస్తరించటానికి, జిల్లా స్థాయిలో IT-governanceను పటిష్ఠపరచటానికి, స్థానిక entrepreneurs మరియు ఐటి ఆసక్తి గల యువతకు వారి నూతన ఆవిష్కరణలు మరియు స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు, ఇ-గవర్నెన్స్ కార్యక్రమాలను మరింత సులభంగా అందుబాటులోకి తెచ్చేందుకు, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్స్, డేటా సెంటర్స్ మరియు co working space initiatives, procurement, e office, అలాగే, స్థానికంగా ఐటి యూనిట్‌ల స్థాపనకు అవసరమైన సహాయాన్ని కూడా అందించటానికి ఈ నూతన విధానం దోహదపడుతుందని నమ్ముతున్నాము. 

 

ఇవన్నీ సమర్ధవంతంగా జరగటానికి APTS జిల్లా స్థాయిలో కూడా క్రియాశీలకంగా ఉంటే రాష్త్ర ప్రభుత్వం ఐటీ అభివృద్ధికి తీసుకొస్తున్న ఈ కార్యక్రమాలన్నీ విజయవంతంగా ముందుకు వెళ్తాయని భావిస్తున్నాము.

ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శకంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి నారా లోకేష్ గారి సారధ్యం లో APTS ఇన్ని బహుముఖ కార్యక్రమాల ద్వారా, ఆంధ్రప్రదేశ్ అంతటా డిజిటల్ పాలనను ముందుకు తీసుకెళ్లడానికి, సైబర్ సెక్యూరిటీ ని మెరుగుపరచడానికి, రాష్ట్రంలో టెక్నాలజీ సేవలను మరింత విస్తృత పరచటానికి మరియు IT అభివృద్ధిని ప్రోత్సహించడానికి, తద్వారా రాష్ట్రంలో ఉద్యోగాలు, ఉపాధి, ఆదాయం పెరిగి రాష్ట్రాభివృద్ధికి తోడ్పడాలని APTS కట్టుబడి ఉంది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
మరోసారి భారీగా ఉద్యోగాల కోతకు సిద్ధమైన మైక్రోసాఫ్ట్! వేల మంది టార్గెట్!


వీరయ్య చౌదరి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. 9 మందిని అరెస్ట్! హత్యకు కారణం ఇదే!



వైసీపీకి షాక్.. మాచర్ల మున్సిపల్ చైర్మన్కు షాకిచ్చిన సర్కార్.. పదవి నుండి తొలగింపు!



సింధూ జలాలపై కాళ్ల బేరానికి పాకిస్థాన్! భారత్‌కు విజ్జప్తి చేస్తూ లేఖ!



కడప మేయర్ కు భారీ షాక్‌! అవినీతి ఆరోపణలతో పదవి నుండి తొలగింపు!



చంద్రబాబు నేతృత్వంలో పొలిట్‌బ్యూరో సమీక్ష! నామినేటెడ్ పదవులపై ఫోకస్!


బెట్టింగ్ మాఫియాకు షాక్! ఇద్దరు బుకీలు అరెస్ట్.. మాజీ కేసులు మళ్లీ రంగంలోకి!

 

పొరపాటున వేరే రైలెక్కిన మహిళ..! ఇంతలోనే ఎంత ఘోరం..!

 

హైదరాబాద్‌ విమానాశ్రయంలో హై అలెర్ట్! డ్రోన్లకు నో పర్మిషన్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #APTS #DigitalGovernance #WelfareForAll #TechForGood #AndhraPradesh #CyberSecurity #AadhaarServices #Politics #TDP #JSP #YCP #PawanKalyan #Janasena #AP #AndhraPradesh #YSJagan #Assembly #BJP #NaraLokesh #PawanKalyan #PSPK #HighCourt #Amaravathi #BJP